పరువు తీసుకున్న లారెన్స్

Raghava Lawrence

లారెన్స్ కి దర్శకుడిగా, హీరోగా క్రేజ్ తెచ్చింది …కాంచన మూవీ. అదే సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో లారెన్స్ పరువుని అరేబియా సముద్రంలో కలిపింది.

“కాంచన” సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన అన్ని చిత్రాలు తెలుగునాట, తమిళనాట కాసులవర్షం కురిపించాయి. ఈ సినిమా హిందిలో కూడా వర్కౌట్ అవుద్ది అని లారెన్స్ కి ఎందుకు అనిపించిందో తెలీదు కానీ తన గోతి తనే తవ్వుకున్నట్లైంది. జాతీయస్థాయిలో పరువు పోయింది కాంచన హిందీ వర్షన్ తో.

“లక్ష్మి బాంబ్” పేరుతో అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఐతే, తీరా విడుదల టైములో బాంబ్ ని టైటిల్ నుంచి డ్రాప్ చేశాడు. సినిమా షూటింగ్ అవుతున్నప్పుడే లారెన్స్ డైరెక్షన్ నచ్చక… ప్రొడ్యూసర్స్ పక్కన పెట్టారు. అప్పుడు లారెన్స్ పెద్ద గోల చేశాడు. సోషల్ మీడియాలో రచ్చ చేసి ప్రొడ్యూసర్స్ దిగి వచ్చేలా చేశాడు. చివరికి ఎలాగోలా సినిమాని పూర్తి చేసి హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తే… ఘోరమైన కామెంట్స్ వచ్చాయి.

బాలీవుడ్ క్రిటిక్స్ లారెన్స్ ని ఉతికి ఆరేశారు. ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో తమ కామెంట్స్ తో ఆటాడుకున్నారు. “లక్ష్మి”కి ఇంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో అక్షయ్ కుమార్ కూడా తెగ ఫీల్ అవుతున్నాడట. ఇక లారెన్స్ కాంచన కథల్లోని పిచ్చితనం ఏంటో జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ అయింది.

Related Stories