
రాఘవ లారెన్స్ డాన్స్ డైరెక్టర్ నుంచి హీరో అయ్యాడు. ‘కాంచన’/’ముని’ సిరీస్ చిత్రాలతో స్టార్ గా నిలబడ్డాడు. ప్రస్తుతం జోరు తగ్గింది. 45 ఏళ్ల లారెన్స్ కెరీర్ పరంగా రిలాక్స్ అయ్యాడు. ఇప్పుడు అతన్ని విలన్ గా నటింపచెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.
కార్తీ నటించిన ‘ఖైదీ’, ‘విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలతో ఈ దర్శకుడు ఒక్కసారిగా పెద్ద డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ఇక ఇప్పుడు తన గురువు కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ అనే సినిమా తీయనున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో విలన్ గా లారెన్స్ అయితే బాగుంటుంది అని అతని ఆలోచన. అందుకే అతన్ని అప్రోచ్ అయ్యాడట. మరి లారెన్స్ ఒప్పుకుంటాడా అనేది చూడాలి.
కమల్ హాసన్ తో కానగరాజ్ తీసే ఈ మూవీ షూటింగ్ తమిళనాడు ఎన్నికలు పూర్తి అయ్యాకే జరుగుతుంది. ప్రస్తుతం కమల్ ఎన్నికల ప్రచారంలో బిజిగా ఉన్నాడు.