బరువు మాత్రమే కాదు, రేటు కూడా ఎక్కువే

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రాసిన పుస్తకం అంటే ఎవరికైనా ఆసక్తే. 4 దశాబ్దాల తన అనుభవాన్ని రంగరించి ఆయన రాసిన వాక్యాలు చదవాలని అందరికీ ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నేటితరం హీరోల వరకు ఎంతోమందిపై ఆయన తన అభిప్రాయాలు, తెరవెనక విశేషాలు పంచుకొని ఉంటారు.

ఇలా ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో ఆయన రచించిన పుస్తకం చదువుదామని అనుకుంటే మాత్రం చిన్నపాటి షాక్ తగలక మానదు. అవును.. రాఘవేంద్రరావు రాసిన పుస్తకం పట్టుకుంటే బరువుగా ఉంటుంది. అది మాత్రమే సమస్య కాదు, ముట్టుకుంటే దీని రేటు కూడా బరువే.

“నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ” అంటూ రాఘవేంద్రరావు రచించిన ఈ పుస్తకం కాస్త బరువుగా ఉంటుంది. పైగా దీని రేటు కూడా 3వేల రూపాయలుంది. మార్కెట్లోకి ఓ పుస్తకం వచ్చిందంటే వెంటనే కొని చదవాలనుకుంటారు చాలామంది పాఠకులు. పైగా రాఘవేంద్రరావు లాంటి దర్శకుడి నుంచి వస్తున్న పుస్తకం అంటే వంద ఎక్స్ ట్రా అయినా కొని చదవాలనుకుంటారు.

సాధారణంగా సినీ పుస్తకాల రేట్లు 300 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్య ఉంటాయి. అయితే రాఘవేంద్రరావు రాసిన ఈ పుస్తకం మాత్రం 3వేలు ఉంది. పాఠకుడికి ఇది చిన్న పాటి షాకే అని చెప్పాలి.

 

More

Related Stories