రాఘవేంద్రరావు మూడు ముక్కలాట

Raghavendra Rao, Trisha,Shriya, Ramya Krishna

రాఘవేంద్రరావు సినిమాల్లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కామన్. హీరోయిన్ల మధ్య హీరో నలిగిపోయే సన్నివేశాలు, కథలు కూడా కామన్. ఒక్కోసారి ఈ దర్శకుడు తన సినిమాల్లో ముగ్గురు హీరోయిన్ల మధ్య సంఘర్షణను చూపిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడిలాంటి సినిమాలో స్వయంగా రాఘవేంద్రరావు హీరోగా నటిస్తే ఎలా ఉంటుంది?

ఆ సమయం రానే వచ్చింది. ముగ్గురు హీరోయిన్లతో రాఘవేంద్రరావు హీరోగా సినిమా రాబోతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. దర్శకేంద్రుడు ముఖానికి రంగేసుకోబోతున్నాడు. ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించబోతున్నాడు. రాఘవేంద్రరావు సరసన శ్రియ, త్రిష, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించబోతున్నారు.

ఇక గెటప్ విషయంలో కూడా రాఘవేంద్రరావు పెద్దగా మేకోవర్ ట్రై చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హీరోలంతా గడ్డాలు పెంచుతున్నారు. అలాంటి గడ్డానికి కొన్ని దశాబ్దాలుగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు రాఘవేంద్రరావు. కాబట్టి.. కొత్తగా మేకోవర్ ఏమీ ఉండదు.

అంతా బాగానే ఉంది కానీ.. 78 ఏళ్ల రాఘవేంద్రరావును హీరోను చేసి మేకర్స్ ఎలాంటి కథను హ్యాండిల్ చేయబోతున్నారనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ.

చూస్తుంటే.. ఈ కథ ఓ సీనియర్ సిటిజన్ చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఉండొచ్చు. అలాంటప్పుడు త్రిష, శ్రియ లాంటి ముద్దుగుమ్మలకు ఈ సినిమాలో ఏం పని? ఈ ప్రశ్నలకు త్వరలోనే జవాబులు దొరుకుతాయి. ఇంతకీ దర్శకుడు ఎవరో?

Related Stories