ఇక కన్నడ సీమలో డ్రగ్స్ కలకలం

కన్నడ చిత్రసీమలో డ్రగ్స్ రచ్చ మొదలైంది. కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై సి.ఐ.డి. అధికారులు దాడులు చేశారు. దాంతో కన్నడ చిత్రసీమ (శాండల్ వుడ్ అంటారు ఈ పరిశ్రమని)లో కూడా డ్రగ్స్ కలకలం షురూ అయింది.

ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ వాడకం గురించి బద్నామ్ అయింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ ప్రముఖలని డ్రగ్స్ లింక్స్ విషయంలో విచారించింది. తాజాగా… సుశాంత్ రాజపుత్ సింగ్ మరణం కేసు డ్రగ్స్ మూలంగా మలుపు తిరిగింది. రీయా సోదరుడు సౌవిక్ కి డ్రగ్స్ ముఠాకి లింకులున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ అంతా డ్రగ్స్ మయం అని కంగనా రనౌత్ ఆరోపిస్తోంది.

అప్పట్లో తెలంగాణ ఎక్సయిజ్ అధికారులు డ్రగ్స్ ముఠాలతో టాలీవుడ్ కి ఉన్న లింక్ ల విషయంలో ఎలా విచారణ చేశారో ఇప్పుడు కర్ణాటక సిఐడి అధికారులు కూడా బెంగళూరులో విచారణ చేస్తున్నారు. పలువురు సెలెబ్రిటీలని ఇంటరాగేట్ చేస్తున్నారు. తాజగా రాగిణి ద్వివేదిని విచారిస్తున్నారు. తెలుగులో నాని సరసన “జెండాపై కపిరాజు” సినిమాలో నటించింది రాగిణి ద్వివేది.

Related Stories