రెహమాన్ కూతురు ఆగ్రహం!

AR Rahman's controversy

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ తన 30 ఏళ్ల కెరీర్ లో మొదటిసారిగా తిట్లు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదీ కూడా అభిమానుల నుంచే. విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు. దాంతో రెహమాన్ కూతురికి కోపం వచ్చింది. “మా నాన్న చెయ్యని తప్పుకు మాటలు పడుతున్నారు,” అని ఆమె అంటున్నారు.

రెహమాన్ ఇటీవల చెన్నైలో ఒక సంగీత విభావరి నిర్వహించారు. ఐతే, ఇది రసాభాసగా మారింది. నిర్వహకులు టికెట్ కొన్న వారిని సైతం లోపలి అనుమతించకపోవడం, కొందరిని కొట్టడం, దూషించడం చేశారు. వచ్చిన జనాన్ని తిప్పి పంపారు. తోపులాట జరిగింది. మొత్తంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఐతే, టికెట్ కొన్నవారు తమకు జరిగిన అవమానం, అసౌకర్యం గురించి సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పెడుతూ రెహమాన్ ని దూషిస్తున్నారు.

దాంతో, రెహమాన్ నిర్వాహకుల నిర్వాకానికి తాను బాధ్యత వహిస్తాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినా, విమర్శలు, ట్రోలింగ్ ఆగలేదు.

సో, రెహమాన్ కూతుళ్లు క్షితిజ, రహీమా సోషల్ మీడియా ట్రోల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా నాన్న చేసిన సేవా కార్యక్రమాలు ఇవి,” అంటూ ఒక లిస్ట్ కూడా పోస్ట్ చేశారు.

More

Related Stories