తొందర్లోనే రాహుల్ రామకృష్ణ పెళ్లి!


కమెడియన్ రాహుల్ రామకృష్ణ అప్పుడెప్పుడో తన గాళ్ ఫ్రెండ్ తో పెళ్లి అని ప్రకటించారు. ఆ తర్వాత దాని గురించి ఊసు లేదు. ఆదివారం సడెన్ గా సోషల్ మీడియాలో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని షేర్ చేశారు రాహుల్ రామకృష్ణ.

“ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతున్నాను. త్వరలోనే,” అని ఒక ఫోటోని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న వైనం చూడొచ్చు.

ఇంగ్లీష్ దంచికొట్టే ఈ కమెడియన్ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. ఐతే, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు మాత్రం రాహుల్ బయట పెట్టలేదు. మరోవైపు, ఈ కిస్ ఫోటో షేర్ చెయ్యడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కమెడియన్ గా లైంలైట్లోకి వచ్చిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు దాదాపు ప్రతి సినిమాలో నటిస్తున్నారు. గతేడాది ‘జాతిరత్నాలు’ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఈ ఏడాది ‘ఆర్ ఆర్ ఆర్’లో కూడా మంచి పాత్రలో దర్శనమిచ్చారు.

 

More

Related Stories