రాహుల్ కొడుకు పేరు ఇదే

Rahul Ramakrishna

నటుడు రాహుల్ రామకృష్ణ తన కొడుక్కి వెరైటీ పేరు పెట్టాడు. “మీట్ మై సన్. హిజ్ నేమ్ ఈజ్ రూమి,” అంటూ కొత్త పోస్ట్ పెట్టాడు. తన కొడుకు ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

రూమి అనే కవి పేరుని తన కొడుక్కి పెట్టుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఇరాన్ కి చెందిన 13వ శతాబ్దపు కవి.. రూమి. చిన్న చిన్న కొటేషన్లలా ఉండే ఆయన కవితలు ఈ ఇంటర్నెట్ యుగంలో బాగా పాపులర్ అయ్యాయి. సాహిత్య అభిరుచి ఉన్న రాహుల్ అలా కవి పేరుని పెట్టుకున్నాడు తన కుమారుడికి.

రాహుల్ రామకృష్ణ గత ఏడాది హరిత అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరికి ఒక బాబు పుట్టాడు.

రాహుల్ రామకృష్ణ ఇప్పుడు సినిమాలు తగ్గించాడు. కాకపోతే, నటుడిగా ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాడు.

 

More

Related Stories