
రాహుల్ రామకృష్ణ గడ్డం ఎందుకు తీయడం లేదు? ప్రతి సినిమాలో ఫుల్లుగా గడ్డంతోనే కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాలో అయన చేసిన నటన జనం ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఐతే, అతని లుక్కే కొంత ఇబ్బందిగా ఉంది. గడ్డం మరి ఓవర్ గా పెరిగింది. ఎందుకు ట్రిమ్ చేసుకోవట్లేదు అనేది అందరి అనుమానం.
దానికి సమాధానం ఒక్కటే. రాజమౌళి తీస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో రాహుల్ నటిస్తున్నాడు. ఇందులో కొమురం భీంకి అనుచరుడి పాత్రలో కనిపిస్తాడు. ఫుల్ లెంగ్త్ రోల్. ఎన్టీఆర్ భీంగా నటిస్తున్నాడు. ఈ సినిమా సైన్ చేసినప్పుడే… మొత్తం సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు గడ్డం తీయనని ఒప్పందం చేసుకున్నాడట. అందుకే, ఇప్పటివరకు రాహుల్ షేవింగ్, ట్రిమ్మింగ్ చేసుకోవడం లేదు.
వచ్చే నెలలో “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ పూర్తి అవుతుంది. దాంతో రాహుల్ గెటప్ మారుతుంది.