
‘టాక్సీవాలా’ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు రాహుల్ సంకృత్యాన్. అతను తీసిన రెండో మూవీ… నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’. డిసెంబర్ 24న విడుదలకాబోతున్న తరుణంలో రాహుల్ సంకృత్యాన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
– రచయిత సత్యదేవ్ జంగా ఈ కథ బెంగాల్ లో జరుగుతుంది అని చెప్పగానే ఎక్జాయిట్ అయ్యాను. ‘దేవదాసి’ వ్యవస్థ గురించి చర్చ ఉంది. కానీ అది మెయిన్ సబ్జెక్ట్ కాదు… కథలో క్యారెక్టర్‌కి భాగంగా తీసుకున్నదే. దానికి వ్యతిరేఖంగా హీరో పోరాడుతాడు.
– నాని రెండు పాత్రలు పోషించారు. ఒకటి శ్యామ్ సింగ రాయ్ అనే పాత్ర. రెండో వాసు అనే మరో పాత్ర. స్క్రీన్ ప్లే పరంగా, విజువల్స్ పరంగా ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది. అలా ఒక్కో అంశం డెవలప్ అవుతూ కథ సాగుతుంది.
– ఈ కథ భారీ బడ్జెట్ డిమాండ్ చేసింది. మా నిర్మాత ఆ విషయంలో వెనుకాడలేదు. క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరణ చాలా చాలెంజింగ్ అనిపించింది. అది ఎందుకు అనేది సినిమా విడుదలయ్యాక చెప్తాను.
– సాయి పల్లవి మంచి డ్యాన్సర్..ఈ సినిమా కోసం క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. పగలంతా రిహార్సల్ చేయడం రాత్రి పెర్ఫామ్ చేయడం అలా ఏడు రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ కంటిన్యూగా చేసింది.
– ప్రస్తుతం టైమ్ ట్రావెల్ జోనర్‌లో ఒక కథ రెడీగా ఉంది. అది మరో డిఫరెంట్ జోనర్ ఈ సినిమా తర్వాత దాని గురించి ఆలోచిస్తాను.