
పునర్నవిని వదిలేసి ఐష్ రెడ్డితో రాహుల్ డేటింగ్ షురూ చేశాడా? అలాగే అనిపిస్తోంది… అతని రీసెంట్ ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు చూస్తుంటే.
“బిగ్ బాస్ 3” టైటిల్ విన్నర్ గా పాపులరైన రాహుల్ సిప్లిగంజ్ మంచి సింగర్. రీసెంట్ గా హైదరాబాద్ నగరంపై అతను చేసిన పాటని మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. అటు పాటలతో, ఇటు అమ్మాయిలతో డేటింగ్ లతో వార్తల్లో నిలుస్తున్నాడు రాహుల్.
ఐతే, పునర్నవితో ప్రేమ బంధం లేదు. ఇటు ఐష్ రెడ్డితోనూ డేటింగ్ లో లేను అంటున్నాడు. “వాళ్ళు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. నా గ్యాంగ్ లో మెంబర్స్. వారితో లంచ్, డిన్నర్ కి వెళ్తాను. అంతే,” అని రాహుల్ రీసెంట్ గా క్లారిఫికేషన్ ఇచ్చాడు.
ఇప్పుడు హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో… బిగ్ బాస్ కంటెస్టెంట్లకు, ఆ సీజన్ విన్నర్స్ కి కూడా అంటే క్రేజ్ వస్తోంది. బిగ్ బాస్ లో పాల్గొనకముందు కూడా రాహుల్ పాటలు పాడాడు. కానీ ఈ క్రేజ్ లేదు. ఈ ప్రేమ పుకార్లు లేవు. అందమైన భామలతో “కేవలం ఫ్రెండ్సిప్”లు కూడా లేవు.