పునర్నవితో ఎఫైర్.. గతం గతః

Rahul Sipligunj and Punarnavi

“స్క్రీన్ మీద కనిపించేవన్నీ నిజాలు కావు. ప్రతి ఒక్కరికి వాళ్ల జీవితం ఉంటుంది. బిగ్ బాస్ అనేది అయిపోయింది. ప్రతి ఒక్కరు దాన్నుంచి బయటకు వచ్చేశారు. సో.. మరోసారి నన్ను పునర్నవి గురించి అడిగి చంపకండి. ఛిల్.”

పునర్నవితో ఎఫైర్ అంటూ వస్తున్న వార్తలపై ఇలా మరోసారి సూటిగా స్పందించాడు బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. పున్నూతో జరిగిందంతా గతం అని, ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నామని క్లియర్ గా చెప్పేశాడు.

బిగ్ బాస్ హౌజ్ లో వీళ్లిద్దర్నీ చూసి చాలామంది ప్రేమికులు అనుకున్నారు. బయటకొచ్చిన తర్వాత డేటింగ్ చేస్తారని, ఎంగేజ్ మెంట్ కూడా వెంటనే ఉండొచ్చంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు రాహుల్.

మరోవైపు రాహుల్, వితిక, వరుణ్ సందేశ్ బ్యాచ్ కు పునర్నవి దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లు నలుగురు ఒక బ్యాచ్. ఎప్పుడూ పార్టీలు చేసుకుంటారు. అయితే ఈమధ్య పునర్నవి, వీళ్ల ముగ్గురితో పెద్దగా కలవడం లేదంట. రాహుల్ ప్రకటన వెనక ఇది కూడా ఓ రీజన్ అయి ఉండొచ్చని చెబుతున్నారు చాలామంది. పునర్నవి ఇప్పుడు ప్రొఫెషనల్ గా కాస్త బిజీ అయింది. ఆమెకు సినిమా ఆఫర్లు, ఫొటో షూట్లు బాగా వస్తున్నాయి.

Related Stories