రాహుల్ రోల్ తెలిసిపోయింది

బిగ్ బాస్ సీజన్-3లో విన్నర్ గా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. బోలెడంత క్రేజ్ తో పాటు.. కావాల్సినంత క్యాష్ కూడా సంపాదించుకున్నాడు. అయితే తనకు సీజన్-4తో కూడా లింక్ ఉందంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు రాహుల్. ఆ లింక్ ఏంటనేది ఇప్పుడు బయటకొచ్చింది.

“బిగ్ బాస్ సీజన్-4 బజ్” అనే కార్యక్రమానికి యాంకర్ గా  ఉండబోతున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల బాధను, ఎమోషన్ ను ఇందులో చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే అలా ఎలిమినేట్ అయినోళ్లను రాహుల్ ఇంటర్వ్యూ చేస్తాడన్నమాట.

సీజన్-3లో వంద రోజులు హౌజ్ లో ఉండొచ్చిన రాహుల్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఎలిమినేట్ అయితే ఆ బాధ ఏంటో బాగా తెలుసు. ఈ “బజ్” కు రాహుల్ కంటే మంచి యాంకర్ ఎవ్వరూ దొరకరు. వచ్చే సోమవారం నుంచి రాహుల్ ఎంట్రీ అన్నమాట. 

Related Stories