ఉన్న పోరిలు చాలురా భయి!

Rahul Sipliganj

పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి కొత్తగా ఇంట్రడిక్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. బిగ్ బాస్ హౌస్ లోనే కాదు, బయట కూడా హగ్ లు, పెగ్ లు, కిస్ లతో రెచ్చిపోయారు. మా మధ్య ఏమి లేదంటూనే… పునర్నవి కోసం ఒక్కడితో పబ్బులో గొడవపడి తలకి గాయం చేసుకున్నాడు రాహుల్. ఆ రేంజులో వీరి మధ్య ఫ్రెండ్షిప్ గురించి జనాలకి తెలుసు కాబట్టే… పునర్నవి తనకి ఎంగేజ్మెంట్ అయింది అని పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియా ఫాలోవర్స్ రెచ్చిపోయారు.

పునర్నవి ఎవర్నో పెళ్లి చేసుకుంటోంది… మరి నీ పరిస్థితి ఏంటి భయ్యా… అంటూ అతన్ని టాగ్ చేసి చావగొడుతున్నారు. పునర్నవి పెట్టిన ఆ ఎంగేజ్ మెంట్ ఫోటో… ఒక వెబ్ సిరీస్ ప్రొమోషన్ కోసం అన్నది తెలియని అమాయక జనం అతన్ని ఇబ్బంది పెట్టారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన రాహుల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.

“ఎవరిదో ఎంగేజ్ మెంట్ అయితే నన్నెందుకు ట్యాగ్ చేస్తుర్రు రా భై.. ఉన్న పోరీలతోనే సరిపోతలేదు నాకు.. ఇంక ఎక్స్ ట్రా ఫిట్టింగ్‌లు నాకెందుకరా నాయనా…” అంటూ రెస్పాండ్ అయ్యాడు.

రేపు “బేబీ” అనే వీడియో సాంగ్ వదులుతున్నా… దాన్ని మాత్రం ట్రెండ్ చెయ్యడం మరవొద్దు అంటూ ట్రోల్ల్స్ కి ఒక సలహా డ్రాప్ చేశాడు.

More

Related Stories