
కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కుతున్న మూవీ ‘పంచతంత్రం’. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య మెయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఒక హీరోగా రాహుల్ విజయ్ కూడా నటిస్తున్నాడు.
హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం (జూన్ 7) రాహుల్ విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ నటిస్తున్నారని తెలిపారు మేకర్స్.
“పెళ్లి, కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయాల్లో కచ్చితమైన భావాలు ఉన్న 28 సంవత్సరాల యువకుడు సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ కనిపిస్తారు. ఈతరం యువతకు పెళ్లి, జీవితాంతం కొనసాగే బంధాలు, బాధ్యతలు వంటి విషయాల్లో ఉండే కన్‌ఫ్యూజన్‌ను, క్లారిటీని చూపించే పాత్ర. సింపుల్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు” అని చెప్పారు డైరెక్టర్ హర్ష పులిపాక.