శ్రీలీలకి ఆఫర్లే ఆఫర్లు

ఇప్పటివరకు విడుదలైన సినిమా ఒక్కటే. కానీ శ్రీలీలకి ఒప్పుకున్న చిత్రాలు, ఆమె వల్లో వాలుతున్న కొత్త సినిమాల లెక్క మామూలుగా లేదు. రాఘవేంద్ర రావు తీసిన ‘పెళ్లి సందD’ అనే చిత్రంతో అడుగుపెట్టిన ఈ భామ తాజాగా వైష్ణవ్ తేజ సరసన ఒక సినిమా ఒప్పుకొంది. ఆ సినిమా ఈ రోజు లాంఛనంగా పారంభమైంది.

ఈ 21 ఏళ్ల పిల్ల చేతిలో ఉన్న చిత్రాలు ఏవంటే…

  1. రవితేజ సరసన ‘ధమాకా’
  2. అనగనగా ఒక రాజు
  3. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు మొదటి చిత్రం
  4. వైష్ణవ్ తేజ్ మూవీ
  5. రామ్ – బోయపాటి మూవీ?

తెలుగు అమ్మాయి శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అందుకే, ఆమె మొదటి సినిమాతోనే కుర్రకారుని బాగా ఆకట్టుకొంది. దాంతో, మేకర్స్ ఆమె వెంట పడుతున్నారు.

ఎన్టీఆర్, మహేష్ బాబు కొత్త సినిమాల్లో కూడా ఈ భామ నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ, అవి నిజం కాదు.

 

More

Related Stories