- Advertisement -

ప్రభాస్ హీరోగా రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ సినిమా హిందీలో రీమేక్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు. వీవీ వినాయక్ డైరెక్టర్. బెల్లంకొండ సాయికి, వినాయక్ కి ఇది బాలీవుడ్ ఎంట్రీ. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారట. దానికోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఏకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్‌బాబు ఓ విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారట.
ఐతే, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల వల్ల షూటింగ్ మొదలు కాలేదు. ఇక తాజాగా హైదరాబాద్ లో కురిసిన వర్షాల తాకిడికి ఈ సెట్ తీవ్రంగా దెబ్బతిందట.