శిల్పకి ఆస్తుల ట్రాన్స్ఫర్

- Advertisement -

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సడెన్ గా తన ఆస్తులను ఆమె పేరిట రాయడం హాట్ టాపిక్ గా మారింది. ముంబైలో వారు ఉంటున్న బిల్డింగ్ లో ఓషియన్ వ్యూ అనే బిల్డింగ్ లో ఉన్న ఐదు ఫ్లాట్ లను శిల్పాశెట్టి పేరిట ట్రాన్స్ఫర్ చేయించాడు రాజ్ కుంద్రా. వీటి విలువ 38 కోట్ల రూపాయలు.

రాజ్ కుంద్రా ఇటీవల జైలు నుంచి బెయిల్ మీద వచ్చారు. ఆయన నీలి చిత్రాల నిర్మాణం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు నడుస్తోంది. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. తన భర్తతో కలిసి పూజలు చేస్తున్న ఫోటోలను కూడా ఇటీవల షేర్ చేసింది శిల్ప.

ఐతే ఆస్తుల పంపకాలు జరుగుతుండడంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు అల్లుతోంది.

శిల్పాశెట్టి ప్రస్తుతం టీవీ షోలతో బాగానే సంపాదిస్తున్నారు.

 

More

Related Stories