పెళ్లయిన హీరోని అబ్జర్వ్ చేస్తున్నా

Raj Tarun

ప్రశ్న: ఇంతకీ పెళ్లెప్పుడు?
ఆన్సర్ : మరో రెండేళ్లలో చేసుకుంటాను.

రాజ్ తరుణ్ ను ఈ ప్రశ్న ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం వస్తుంది. 2018లో ఇలానే చెప్పాడు.. 2019లో ఇలానే చెప్పాడు.. ఇప్పుడు 2020లో కూడా ఇదే సమాధానం వచ్చింది. అయితే ఈసారి ఇలా పొడిపొడిగా కాకుండా తన పెళ్లికి మరో చిన్న లింక్ యాడ్ చేశాడు ఈ హీరో.

ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్. ఈ లాక్ డౌన్ టైమ్ లో అతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భార్యతో కలిసి చిన్న టూర్ లో (హనీమూన్ లాంటిది) కూడా ఉన్నాడు. ముందుగా నిఖిల్ వైవాహిక జీవితం ఎలా ఉందో నిశితంగా గమనిస్తాడట రాజ్ తరుణ్. నిఖిల్-పల్లవిల మ్యారీడ్ లైఫ్ ని చూసి అప్పుడు తను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు.

ఇలా ఈ ఏడాది కూడా పెళ్లిపై అడిగితే తప్పించుకున్నాడు రాజ్ తరుణ్. తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని, హీరోయిన్లంతా తనతో సరదాగానే ఉంటారంటున్న ఈ హీరో.. లవ్ మ్యారేజ్ చేసుకుంటానా, ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానా అనే విషయం తన చేతిలో లేదంటున్నాడు.

Related Stories