
ఈ వీకెండ్ విడుదల అవుతోన్న మూవీ…’స్టాండప్ రాహుల్’. హీరో రాజ్ తరుణ్ కి ఇటీవల హిట్స్ లేవు. చాలా కాలం తర్వాత తన శైలికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ట్రెండీగా ఉన్నాడు ఈ చిత్రంలో. రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ నటించింది.
ఈ సినిమాలో తన పాత్రకి ఆడిషన్ చేశానని అంటున్నాడు రాజ్ తరుణ్. “ఈ కథను దర్శకుడు శాంటో నాకు నాలుగు గంటలపాటు చెప్పాడు. కథ నచ్చింది చేస్తాను అన్నాను కానీ, విచిత్రంగా ఆయనకే నా మీద నమ్మకం కలగలేదు. నాతో ఆడిషన్ చేయించాడు. అప్పుడు ఆయనకు నాపై నమ్మకం ఏర్పడింది,” అని చెప్పాడు రాజ్ తరుణ్.
స్టాండప్ అనేది తెలుగువారికి అంతగా పరిచయం లేనిదే. “అవును. కానీ లక్కీగా ఇటీవలే పూజాహెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో స్టాండప్ కమెడియన్ పాత్ర చేసింది. అది మా సినిమాకు హెల్ప్ అవుతుందని చెప్పగలను. కామెడీతోపాటు మంచి ఎమోషన్స్ కూడా మా సినిమాలో వుంటుంది,” అని అన్నాడు ఈ కుర్ర హీరో.
‘స్టాండప్ రాహుల్’ ఎప్పుడో విడుదల కావాలి. కానీ చాలా లేట్ అయింది. “ఈ సినిమా థియేటర్లలోనే చూడాలి. అందుకే, ఇంతకాలం ఆగి విడుదల చేస్తున్నామ,”ని వివరణ ఇచ్చాడు రాజ్ తరుణ్.