బుజ్జిగాడిపై ఆహా లెగ్

Orey Bujjiga

ఓటీటీలో వరుసగా అన్నీ సీరియస్ మూవీస్ వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఓ కామెడీ మూవీ పడితే జనాలు ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతారు. సరిగ్గా ఇలానే భావించింది “ఒరేయ్ బుజ్జిగా” యూనిట్. తమ సినిమాలో కామెడీ ఉండడంతో క్లిక్ అవుతుందని భ్రమ పడింది. కానీ అతి కామెడీ కారణంగా ఈ సినిమా చతికిలపడింది.

‘ఆహా’ యాప్ లో నిన్న సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమాకు డల్ రెస్పాన్స్ వస్తోంది. బిట్లు బిట్లుగా అక్కడక్కడ కామెడీ బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమాను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నెటిజన్లు. చివరికి కామెడీని ఇష్టపడేవాళ్లు కూడా సినిమా సెకెండాఫ్ లో వచ్చిన సాగదీత కామెడీని భరించలేకపోయారు.

అలా మరో ఫ్లాప్ షో కు వేదికగా మారింది ‘ఆహా’. లాంఛింగ్ నుంచి ఇప్పటివరకు సరైన కంటెంట్ ను పట్టుకోలేక ఇబ్బంది పడుతోంది ఈ యాప్. చివరికి ‘సిన్’ లాంటి అడల్ట్ కంటెంట్ వేసినా జనాలు పట్టించుకోలేదు. ‘జోహార్’, ‘అమరం అఖిలం ప్రేమ’, ‘బుచ్చిన్నాయుడు కండ్రిగ’ లాంటి సి-గ్రేట్ సినిమాల్ని అస్సలు దేకలేదు. 

ఇలాంటి టైమ్ లో ఆశలన్నీ ‘బుజ్జిగా’డిపైనే పెట్టుకుంది ఆహా. కానీ ఆ యాప్ కు మరోసారి నిరాశ తప్పలేదు. సరైన కంటెంట్ పట్టుకోవడంలో, జనరేట్ చేయడంలో ‘ఆహా’ వరుసగా ఫెయిల్ అవుతూ వస్తోందనే విషయం ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.

ఈ సంగతి పక్కనపెడితే.. అటు రాజ్ తరుణ్ తన ఫ్లాపులకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఇదే దర్శకుడితో ప్రస్తుతం మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. కనీసం ఆ మూవీతోనైనా ఈ హీరో, ఆ దర్శకుడు హిట్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి.

Related Stories