సమంత సూపర్ హాట్: రాజ్ తరుణ్

ఫేవరెట్ హీరోహీరోయిన్లు సామాన్య ప్రేక్షకులకే ఉంటారా..? ఒక హీరోకు మరో హీరో ఫ్యాన్ అవ్వకూడదా..? ఎందుకు అవ్వకూడదు.. దీనికి రాజ్ తరుణ్ బెస్ట్ ఎగ్జాంపుల్. తన ఫేవరెట్ హీరోహీరోయిన్లు ఎవరో చెప్పుకొచ్చాడు ఈ నటుడు.

రాజ్ తరుణ్ ఫేవరెట్ హీరో మహేష్ బాబు. మహేష్ అంటే చిన్నప్పట్నుంచి రాజ్ తరుణ్ కు ఎంతో ఇష్టమట. సినిమాల్లోకి వచ్చి హీరోగా 2 హిట్స్ ఇచ్చిన తర్వాత కూడా మహేష్ ను కలవాలని తెగ ప్రయత్నించాడట ఈ హీరో. ఈ విషయం తెలుసుకున్న మహేష్ స్వయంగా రాజ్ తరుణ్ ను తన సెట్స్ కు పిలిపించుకున్నాడట.

అలా బ్రహ్మోత్సవం సెట్స్ లో తన ఫేవరెట్ హీరో మహేష్ బాబును తొలిసారి కలిశానని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. మహేష్ తో మాట్లాడిన తర్వాత అది కలా-నిజమా అనే విషయాన్ని నమ్మలేకపోయానని.. అందుకే 2-3 గంటల పాటు ఆ ఆలోచనలతో అలా నిద్రలోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు.

ఇక తన ఫేవరెట్ హీరోయిన్ సమంత అని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. సమంత నటించిన అన్ని సినిమాల్ని చూసేశానంటున్న రాజ్ తరుణ్.. ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత అంత హాట్ గా తనకు ఎవ్వరూ కనిపించరని చెబుతున్నాడు.

Related Stories