రాజ్ తరుణ్ ను అడ్డుకున్న పోలీసులు

Raj Tarun

హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కరోనా కాలంలో ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సినిమా యూనిట్ పై కేసు నమోదు చేశారు.

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతోంది. ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో సినిమాకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చారు. షూటింగ్ ను ఆపేశారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఔట్ డోర్ లో ఈ షూటింగ్ పెట్టారట. మరీ ముఖ్యంగా ఈ కరోనా టైమ్ లో పబ్లిక్ ప్లేసుల్లో షూటింగ్ అంటే పోలీసుల అనుమతులు తప్పనిసరి. అలాంటిదేం లేకుండానే యూనిట్ ఫ్రేమ్ ఫిక్స్ చేసిందట. అందుకే షూటింగ్ ఆపేసి, ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు ఫైల్ చేశారు ఉప్పల్ పోలీసులు. 

Related Stories