మరో యాక్టర్ నిశ్చితార్థం

Raja Chembolu

“ఫిదా”, “మిస్టర్ మజ్ను”, “అంతరిక్షం”, “‘ఏబీసీడీ’ సినిమాలతో తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజా. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడిగా పరిశ్రమలోకి ఎంటరైన ఈ యాక్టర్… ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి కూడా ఎంటరవుతున్నాడు. ఆగస్టు 13న రాజా నిశ్చితార్థం సింపుల్ అండ్ స్వీట్ గా జరిగింది. ఐతే ఈ విషయాన్ని లేట్ గా షేర్ చేశాడు రాజా చేంబోలు.

తన కాబోయే జీవిత భాగస్వామితో దిగిన ఎంగేజ్ మెంట్ ఫొటోల్ని షేర్ చేశాడు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి.

ఇంట్లో సింపుల్ గా జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ హాజరవ్వలేదు. పెళ్లిని నవంబర్ లో చేయాలని నిర్ణయించారు. త్వరలోనే తన పెళ్లి తేదీని రాజా ఎనౌన్స్ చేయబోతున్నాడు.

Related Stories