‘మిషన్ ఇంపాజిబుల్ స్ఫూర్తితో తీశా’

వినాయక్ వద్ద శిష్యుడిగా వర్క్ చేసిన వారిలో పలువురు డైరెక్టర్లుగా స్థిరపడ్డారు. లేటెస్ట్ గా శ్రీ సారిపల్లి పరిచయం అవుతున్నారు ‘రాజా విక్రమార్క’ అనే చిత్రంతో. కార్తికేయ హీరోగా నటించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. విజయవాడకి చెందిన ఈ కుర్ర దర్శకుడు అమెరికాలో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కోర్స్ చేసి, అక్కడే  ఇండిపెండెంట్ సినిమాలకు పని చేసి ఇండియాకొచ్చారు. ఆ తర్వాత ‘నాయక్’, ‘అల్లుడు శీను’ తదితర సినిమాలకు వినాయక్ వద్ద వర్క్ చేశారట.

‘రాజా విక్రమార్క’ యాక్షన్ చిత్రం. ఐతే, ఫైట్స్ సగటు తెలుగు సినిమాలకు భిన్నంగా ఉంటాయట. “మిషన్ ఇంపాజిబుల్” సినిమాల స్పూర్తితో కొత్తగా ప్రెజంట్ చేశారట.

“ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. క్రమశిక్షణ లేకపోవడం వలన ఎలా ఇబ్బంది పడ్డాడు? ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? అనేది సినిమా. యాక్షన్ అంటే ఇరవైమందిని కొట్టే టైప్ కాకుండా కథలో భాగంగా ఉంటుంది. ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తిగా తీసుకున్నాను,” అని తెలిపారు శ్రీ సారిపల్లి.

కరోనా టైమ్ లో సెకండాఫ్ మార్చారని రూమర్స్ వచ్చాయి. “కథలో కొంచెం బెటర్ మెంట్ చేశాం. కానీ కథను మార్చలేదు,” అని బదులిచ్చారు దర్శకుడు.

“ఆర్ ఎక్స్ 100” చూసిన తర్వాత కార్తికేయతో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట ఈ దర్శకుడు. అలా ఇది పట్టాలెక్కింది. “కార్తికేయ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది,” అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 

More

Related Stories