
“‘రాజధాని ఫైల్స్” విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఊరుకోను అంటున్నారు దర్శకుడు భాను. ఇది ప్రజల జీవితాలను ప్రతిబింబించే సినిమా అని చెప్పారు.
అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 15న విడుదల కానుంది.
“ఇది రైతుల వేదన. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులను రాజకీయాలకు బలి చేసిన వైనాన్ని చిత్రీకరించాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని ఆదరించి రైతు కుటుంబాలని ఆదుకోవాలి,” అని కోరారు నిర్మాత.
“రాజధాని ఫైల్స్” చిత్రం రాజకీయ చిత్రం కాదంటున్నారు ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వినోద్ కుమార్. “ఇది రైతుల వ్యధ. ఇది వారి కథ,” అని ప్రకటించారు వినోద్ కుమార్.
“ఇది పబ్లిక్ ఫిల్మ్. రాజధాని రైతుల ఆవేదనని తెలియజేసే ప్రజల సినిమా, ప్రజల ప్రయోజనం కోసం తీసిన సినిమా ఇది. దీనికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఎంతవరకు అయినా వెళ్తాను. ప్రజల సినిమాని ప్రజల కోసం చూపించేందుకు ఎంతకైనా తెగిస్తా,” అన్నారు దర్శకుడు భాను.