జనం వెల్లువలా వస్తారు: రాజమౌళి

Rajamouli

లాక్ డౌన్ తో మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా..? గతంలోలా సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తాయా? ఇలా చాలా అనుమానాలు, చర్చలు కనిపిస్తున్నాయి. వీటన్నింటిపై సూటిగా స్పందించారు రాజమౌళి. థియేటర్లు తెరిస్తే, పెద్ద సినిమాలకు జనం వెల్లువలా వస్తారనేది జక్కన్న అభిప్రాయం.

“కరోనా వల్ల థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం భయపడుతోంది. ఒక వేళ అనుమతులు ఇచ్చినా జనాలు వస్తారా రారా అనే అనుమానం కూడా ఉంది. కానీ నా ఉద్దేశంలో..  త్వరలోనే థియేటర్లు ఓపెన్ అవుతాయి. మొదటిగా వచ్చే పెద్ద సినిమా లేదా క్రేజ్ ఉన్న సినిమాకు జనం వెల్లువలా వస్తారనేది నా ఉద్దేశం. అయితే అంతకంటే ముందు జనాలకు కరోనాపై భయం తగ్గాలి.”

ఇలా థియేటర్ల రీ-ఓపెన్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు రాజమౌళి. మరోవైపు “ఆర్ఆర్ఆర్” సినిమాపై కూడా స్పందించాడు ఈ దర్శకుడు.

సినిమాను ఎప్పట్నుంచి సెట్స్ పైకి తీసుకురావాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించాడు. మూవీ సెట్స్ పైకి వచ్చిన తర్వాత 10-15 రోజుల్లో తారక్ ఫస్ట్ లుక్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.

Related Stories