తప్పు ఒప్పుకున్న రాజమౌళి

Rajamouli

హీరోలను పొగిడే క్రమంలో ఒళ్ళు మరిచిపోయే మాట్లాడే వాళ్ళు చాలా మందే ఉన్నారు మన దగ్గర. రాజమౌళి కూడా ఒకప్పుడు ప్రభాస్ ని పొగుడుతూ బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ ని తక్కువ చేసి మాట్లాడారు. ఇది జరిగి దాదాపు 15 ఏళ్ళు కావొస్తోంది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.

ఇప్పుడు రాజమౌళి అమెరికాలో ఆస్కార్ అవార్డుల కోసం అక్కడ క్యాంపెన్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ వైరల్ వీడియో గురించి ప్రస్తావన వచ్చింది. దాంతో, తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. నేను ఉపయోగించిన పదాలు సరైనవి కావు అని అంగీకరించారు.

ప్రభాస్ నటించిన ‘బిల్లా’ సినిమా ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్న రాజమౌళి “ధూమ్ 2లో హృతిక్ ని చూసి అందరూ పొగిడేస్తున్నారు. కానీ ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్,” అర్థంలో కామెంట్ చేశారు.

ఇప్పుడు ఆ పాత వీడియోని తీసి వైరల్ చేశారు ఫ్యాన్స్. “ఆ ఈవెంట్ లో అలా అన్నాను. నేను ఉపయోగించిన పదాలు సరైనవి కావు. హృతిక్‌ రోషన్‌ ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఆయనని నేను చాలా గౌరవిస్తాను. అలా నేను అనుండాల్సింది కాదు,” అని ఇపుడు రాజమౌళి తన తప్పుని ఒప్పుకున్నారు.

 

More

Related Stories