
‘ఆర్ఆర్ఆర్’ సినిమా అక్టోబర్ 13న విడుదల అవుతుంది రాజమౌళి ప్రకటించగానే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు. రాజమౌళి నిర్ణయం బాధ్యతారాహిత్యం అంటూ మండిపడ్డాడు. బోనీ కపూర్ కి అంత కోపం రావడానికి కారణం ఉంది. అజయ్ దేవగన్ హీరోగా ఆయన నిర్మించిన “మైదాన్” అనే సినిమా కూడా అక్టోబర్ 13న విడుదల కానుంది. ‘మైదాన్’ రిలీజ్ డేట్ ని ఆయన ఇంతకుముందే ప్రకటించారు.
‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్ హీరో కాదు. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఐతే, అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అజయ్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే నార్త్ ఇండియన్ మార్కెట్ లో మాకు నష్టం అని బోనీ కపూర్ అంటున్నారు. పైగా, ఇది రాజమౌళి సినిమా. దేశమంతా పెద్ద ఎత్తున విడుదల అవుతుంది. అంటే… ‘మైదాన్’కి దెబ్బే.
ఇప్పుడు ‘మైదాన్’ సినిమా డేట్ ని మార్చాల్సిన పరిస్థితి. ఐతే, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేముందు రాజమౌళి అజయ్ దేవగన్ కి ఇన్ఫార్మ్ చెయ్యలేదా? అజయ్ అప్పుడు అభ్యంతరం చెప్పలేదా?