
ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ట్రెండ్స్ ని బట్టి చూస్తుంటే సంక్రాంతికి ఇంతకుముందు ప్రకటించిన సినిమాలన్నీ తప్పుకునేలా ఉన్నాయి. రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 12న విడుదల కానుంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన వస్తుందని అంటున్నారు.
అయితే, అంతకుముందే సంక్రాంతి బరిలో ఉన్న సినిమా నిర్మాతలకు తమ నిర్ణయాన్ని తెలిపారట రాజమౌళి టీం. ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ నిర్మిస్తున్న నిర్మాతలు మాత్రం తమ డేట్ మారదు అని తెగేసి చెప్పినట్లు సమాచారం. మీరు (ఆర్ ఆర్ ఆర్’ సినిమా) సంక్రాంతికి పోటీలో ఉన్న మాకు ఎటువంటి ఇబ్బంది లేదని వారు తేల్చి చెప్పారట. అంతేకాదు, ఈ రోజు రాధేశ్యామ్ టీం మరోసారి తమ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ‘రాధేశ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది.
వచ్చే సంక్రాంతి పండక్కి ‘రాధే శ్యామ్’, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలే రెండు రోజుల గ్యాప్ లో విడుదల అవుతాయి. మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ సినిమాలు కొత్త డేట్స్ చూసుకుంటాయి.
రాజమౌళికి ప్రభాస్ టీం అంత తెగేసి చెప్పడానికి రీజన్ ఉంది. ‘రాధే శ్యామ్’ ఇప్పటికే నాలుగేళ్లుగా నలుగుతోంది ఇంకా ఆలస్యం చేస్తే కష్టం. అందుకే, తమకి ఇంతకుమించి మంచి డేట్ దొరకదని భావిస్తున్నారు ప్రభాస్ నిర్మాతలు.