ఇక రాజమౌళి సినిమాటిక్ యునివర్స్

Rajamouli

రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయత విజయేంద్ర ప్రసాద్ చాలా విషయాలు ముందే చెప్తుంటారు. ఆ సీక్వెల్ ఉంటుంది, ఈ సీక్వెల్ ఉంటుంది అని ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అందులో ఎన్ని అవుతాయో కాలమే సమాధానం చెప్పాలి.

తాజాగా విజయేంద్రప్రసాద్ రాజమౌళి తీయబోయే కొత్త సినిమా గురించి మాట్లాడారు. ఇది ఒక ఫ్రాంచైజీగా రూపాంతరం చెందుతుంది అని వెల్లడించారట. అంటే మహేష్ బాబు – రాజమౌళి సినిమా అనేక భాగాలుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ అని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. ఇండియానా జోన్స్ తరహాలో సాగే మూవీ అని తెలిపారు.

మరోవైపు, ‘మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్’లా ‘రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్’కి బీజం పడుతోందట. ఈ ఆలోచన ఉన్నట్లు రాజమౌళి వెల్లడించారని తమిళ మీడియా చెప్తోంది. ప్రస్తుతానికి ఇవన్నీ అంచనాలే. ఈ విషయాలపై ఒక క్లారిటీ రావాలంటే మరో ఆర్నెళ్లు ఆగాల్సిందే.

మహేష్ బాబు ఈ నెలలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఆగస్టులోపు పూర్తి అవుతుంది. ఆ తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తారు. ఒక రెండేళ్లు ఆ సినిమా షూటింగ్ లోనే. ఈ సినిమాని 2025లో విడుదల చెయ్యాలని భావిస్తున్నారు రాజమౌళి. ఒక హాలీవుడ్ సంస్థ కూడా కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంది.

 

More

Related Stories