
“ఆర్ఆర్ఆర్” ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అభిమానుల్లో కంటే ఇండస్ట్రీ జనాల్లో ఈ సస్పెన్స్ ఎక్కువగా నలుగుతోంది. దర్శకత్వం నుంచి ప్రమోషన్, రిలీజ్ డేట్ వరకు అన్నీ తానై వ్యవహరిస్తున్న రాజమౌళి… ఈ విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీ జనాలు టెన్షన్ పడుతున్నారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి బాక్సాఫీస్ పై కర్చీప్ వేసిన నిర్మాతలు కిందామీద పడుతున్నారు
ఇంతకుముందు చెప్పిన అక్టోబర్ 13 అనే తేదీకి “ఆర్ఆర్ఆర్” రాదనేది పక్కా. అలాంటప్పుడు కొత్త విడుదల తేదీ ప్రకటిస్తే మిగతా సినిమాలన్నీ తలో దారి చూసుకుంటాయి కదా. కానీ జక్కన్న ఆ మాట చెప్పడం లేదు.
తాజా సమాచారం ప్రకారం…”ఆర్ఆర్ఆర్” సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడట. అన్నీ అనుకున్నట్టు కుదిరితే జనవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఆ విషయాన్నైనా తొందరగా ప్రకటిస్తే బాగుండేది. ఇప్పటికే సంక్రాంతి విడుదల తేదీలు ప్రకటించిన సినిమాలు ప్రత్యామ్నాయం చూసుకుంటాయి. లేదంటే పోటీకి సై అంటాయి.
రాజమౌళి మాత్రం విడుదల తేదీ అంశాన్ని ఇంకా నాన్చే ధోరణిలోనే ఉన్నాడు. కొన్ని విషయాలు కొలిక్కి వచ్చిన తర్వాత విడుదల తేదీపై జక్కన్న నుంచి ప్రకటన వస్తుందేమో.