కాంతార ఒత్తిడి పెంచిందట!

Rajamouli


రాజమౌళి కూడా ఇతర సినిమాల సక్సెస్ చూసి భయపడుతుంటారట. భయమంటే వణికిపోవడం కాదు. వాటిని చూసి తన ప్రతిభని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారట. అందుకే రాజమౌళికి ఈ సక్సెస్ రేట్ ఉంది.

చిన్న చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ‘కాంతర. ఇది కన్నడ చిత్రం. కానీ అన్ని భాషల్లో ఆడింది. చిన్న సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధించడం కొత్తేమి కాదు. కానీ ‘కాంతర’… ఒక ‘ఆర్ ఆర్ ఆర్’, ఒక ‘కేజీఎఫ్ 2’కి సమానంగా వసూళ్లు పొందింది. దాని బడ్జెట్ కి, వచ్చిన వసూళ్లతో పోల్చితే ఈ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ కన్నా బిగ్ హిట్. అందుకే, ఈ సినిమా విజయాన్ని చూసి మరోసారి తమ ఆలోచన ధోరణి సరిచూసుకోవాలి అని అంటున్నారు రాజమౌళి.

దేశమంతా హిట్ కావాలంటే భారీ బడ్జెట్ అవసరం లేదని, చిత్ర నిర్మాణ ప్రాసెస్ ని మరోసారి సమీక్షించుకునే స్థితిలోకి ఈ సినిమా మమ్మల్ని నెట్టింది అని ఫ్రాంక్ గా చెప్పారు రాజమౌళి.

భారీ బడ్జెట్ చిత్రాలని, కాంతర వంటి సినిమాలతో పోల్చలేం. వేటికవే ప్రత్యేకం. కానీ, ‘కాంతర’ నేర్పిన పాఠాలు కూడా చాలానే ఉన్నాయి అని రాజమౌళి అభిప్రాయం.

Advertisement
 

More

Related Stories