త్వరలోనే మొదలుపెడుతా: రాజమౌళి

SS Rajamouli

టాప్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం మనకు తెలుసు. ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి మాట్లాడారు.

కర్ణాటకలోని బళ్లారిలో అమృతేశ్వర ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం స్థానిక రాజకీయ నాయకులతో ముచ్చటించారు. వాళ్ళు తన కొత్త సినిమా గురించి అడిగితే సమాధానం ఇచ్చారు. “తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్నా. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇంకా సినిమాకి పేరు పెట్టలేదు,” అని వాళ్లకు చెప్పారు రాజమౌళి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రాజమౌళి – మహేష్ బాబు సినిమా జూన్ లో మొదలవుతుంది. ఈ గ్యాప్ లో మహేష్ బాబు తన బాడీని కొంత మార్చుకోవాలి. ప్రస్తుతం మహేష్ బాబు అదే పనిలో ఉన్నారు.

More

Related Stories