వాటి ప్రభావం ఉంది: రాజమౌళి

Rajamouli


రాజమౌళి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడు ఆయన. ఐతే, రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాల సీన్లు కనిపిస్తుంటాయి. పలు హాలీవుడ్ సినిమాల్లోని యాక్షన్ సీన్లను ఆయన కాపీ కొట్టి తీస్తారని విమర్శలు ఉన్నాయి. ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి చరిత్ర తిరగరాసిన సినిమాల్లో కూడా ఇవి ఉన్నాయని అంటారు.

కానీ తాను కాపీ కొట్టను అని చెప్తున్నారు రాజమౌళి.

“నాపై రామాయణం, మహాభారతం ప్రభావం ఎక్కువ. నా సినిమాల్లో సన్నివేశాలు, పాత్రలకి స్ఫూర్తి ఆ రెండు కావ్యాలే. చిన్నప్పటి నుంచి చందమామ కథలు, రామాయణ, మహాభారత గాథలు విని, చదివి పెరిగాను. కామిక్స్ ఎక్కువ చదివాను. కాబట్టి వాటి ప్రభావం బాగా ఉంది. ఐతే, సన్నివేశాలు, కథనం మొత్తం నా ఊహాశక్తికి తగ్గట్లుగా రాసుకుంటాను. ఏ సినిమాలను అనుకరించను,” అని రాజమౌళి చెప్తున్నారు.

“ఆర్ ఆర్ ఆర్”లో కూడా ఎమోషన్స్ హైలెట్ అవుతాయి అని అంటున్నారు రాజమౌళి. ట్రైలర్ లో యాక్షన్ డోస్ ఎక్కువ ఉంది. కానీ, అసలు ఎమోషన్ వేరు అని అంటున్నారు.

Advertisement
 

More

Related Stories