‘మహేష్ స్క్రిప్ట్ పూర్తి కాలేదు’

Rajamouli

మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని స్పష్టంచేశాడు రాజమౌళి. మహేష్ తో ఎలాంటి మూవీ చేయాలి, జానర్ ఏంటనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదంటున్నాడు దర్శక ధీరుడు.

“ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించే పద్ధతి నాకు తెలియదు. నాకు అంత టైమ్ కూడా ఉండదు. ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత మాత్రమే మహేష్ మూవీ గురించి ఆలోచిస్తాను. మరో సినిమా గురించి ఆలోచించేంత స్పేస్ నా మైండ్ లో లేదు.”

అయితే మహేష్ మూవీ గురించి ఆలోచించట్లేదని చెప్పిన ఇదే రాజమౌళి.. లాక్ డౌన్ మొదలైన కొత్తలో ఆ సినిమా కోసం కొన్ని కథాచర్చలు సాగించిన విషయాన్ని బయటపెట్టాడు. తండ్రి విజయేంద్రప్రసాద్ తో వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని కథలపై కూర్చున్నామని.. కానీ ఇంకా ఏదీ ఫిక్స్ చేయలేదని చెప్పాడు.

అలా మహేష్ మూవీ ప్రాసెస్ ను స్టార్ట్ చేసిన రాజమౌళి.. ప్రస్తుతానికైతే ఆర్ఆర్ఆర్ పైనే పూర్తిగా దృష్టిపెట్టాడు. రేపట్నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

Related Stories