బాలయ్య షోకి రాజమౌళి!


బాలయ్య నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ షోకి రాజమౌళి అతిథిగా వెళ్లనున్నారట. ఇప్పటికే మహేష్ బాబుతో ఒక ఎపిసోడ్ చిత్రీకరించారు. అది త్వరలోనే స్ట్రీమ్ కానుంది ‘అహా’లో. ఇక ఇప్పుడు రాజమౌళిని పిలిచారట. “అఖండ” ఈవెంట్ కే కాదు గతంలో బాలయ్య నటించిన పలు చిత్రాలకు రాజమౌళి అతిథిగా వెళ్లారు. ఇప్పుడు ఆయన షోకి వెళ్లనున్నారు.

రాజమౌళితో కీరవాణి కూడా వెళ్లే అవకాశం ఉంది.

“ఆర్ ఆర్ ఆర్” హీరో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఒక ఎపిసోడ్ కోసం వెళ్తారని టాక్ నడుస్తోంది. కానీ, అది సాధ్యం అవుతుందా అన్నది చూడాలి. ఇప్పటివరకు ఈ షోకి మోహన్ బాబు కుటుంబం, నాని, బ్రహ్మానందం – అనిల్ రావిపూడి గెస్టులుగా వెళ్లారు. బాలయ్యకి ఇటీవల షోల్డర్ సర్జరీ జరిగింది. దాంతో, చేతికి బెల్ట్ పెట్టుకొనే ఈ షోని నిర్వహిస్తున్నారు.

బాలయ్య ఎనర్జీ ఈ షోకి హైలైట్.

Advertisement
 

More

Related Stories