రాజమౌళి పేరు మిస్సింగ్!

- Advertisement -
Rajamouli

ప్రతి ఏడాది ఆస్కార్ అకాడెమీ కొత్త మెంబర్స్ ని తీసుకుంటుంది. వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డు వేడుక కోసం 300 మందికి పైగా కొత్త మెంబర్స్ ని తీసుకొంది అకాడెమీ. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుకి ఎంపికైన చిత్రాల టీంకి సంబంధించిన వారిని, అలాగే విజేతలందరికీ కొత్త మెంబర్షిప్ ఇచ్చింది.

అలా ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి, పాటల రచయిత చంద్రబోస్ కి ఆహ్వానాలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కూడా మెంబర్స్ గా ఆహ్వానాలు పంపింది అకాడెమీ. వీరికే కాదు, ఈ సినిమాకి పనిచేసిన కెమెరా మెన్ సెంథిల్ కుమార్ కి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ కూడా చోటు సంపాదించుకున్నారు.

ఐతే, “ఆర్ ఆర్ ఆర్” సృష్టికర్త రాజమౌళికి మాత్రం ఆహ్వానం పంపలేదు అకాడెమీ. అదేంటో విచిత్రం.

మణిరత్నం, కరణ్ జోహార్ కి కూడా ఈ ఏడాది ఓటర్లుగా చోటు దక్కింది. వచ్చే ఏడాది ఆస్కార్ కి పోటీ పడే చిత్రాలకు వీరు ఓటు వేయొచ్చు.

ALSO READ: NTR, Ram Charan invited to join Oscars Academy

 

More

Related Stories