మళ్ళీ బీజేపీ అనుకూల చిత్రమే!

Rajamouli

దర్శకుడు రాజమౌళి చాలా కాలంగా రైట్ వింగ్ అనుకూల చిత్రాలు తీస్తున్నాడు అనే ముద్ర పడింది. ముఖ్యంగా బీజేపీ పెద్దలకు నచ్చే విధంగా, వారి ఐడియాలజిని ప్రతిబింబించేలా రాజమౌళి సినిమాలు చేస్తున్నారు అని ఇటీవల ఓపెన్ గానే విమర్శలు వినపడ్డాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. రాజమౌళి తాను అతివాదానికి వ్యతిరేకం అని ఆ ఇంటర్వ్వూలో సమాధానం ఇచ్చారు.

ఐతే, “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో నెహ్రూ ఫోటోని పెట్టకపోవడం, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని బీజేపీ ప్రభుత్వం రాజ్యసభకి నామినేట్ చేయడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ‘అసలు మేటర్’ ఏంటనేది.

ఇక, బాలీవుడ్ మీడియా ఈ రోజు ఒక వార్తని బాగా సర్క్యులేట్ చేసింది. మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాలో హీరో పాత్ర ఇలా ఉంటుంది అని ఒక డీటెయిల్ వైరల్ చేసింది బాలీవుడ్ మీడియా. ఆ కథనాల ప్రకారం మహేష్ బాబు పాత్ర శ్రీ ఆంజనేయస్వామి తరహాలో ఉంటుందట. హనుమంతుడు సంజీవని తెచ్చేందుకు ఎలా అడవులు, కొండలు దాటి వెళ్లారో అలా ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఒక సాహసం చేస్తారట.

మహేష్ బాబు పాత్ర పూర్తిగా రామాయణంలోని హనుమాన్ తరహాలోనే ఉంటుంది అనేది ఆ కథనాల సారాంశం.

ఇదే నిజం ఐతే రాజమౌళి, ఆయన తండ్రి (కథారచయిత ఆయనే) బీజేపీ మూల సిద్ధాంతాలకు అనుకూలంగా సినిమాలు తీయడం కంటిన్యూ చేస్తున్నారన్నమాట.

Advertisement
 

More

Related Stories