ఏం చేద్దాం మరి?

Rajamouli

రాజమౌళి ముందున్న ప్రశ్న ఇదే. ఇప్పుడేం చేద్దాం….అనేదే ఆయన ఆలోచన. “ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ ఎంతకీ ఎండ్ అవట్లేదు. ఎప్పుడో ఎదో ఒక ఆటంకం. లాస్ట్ ఇయర్… లాక్డౌన్. ఈ ఏడాది మళ్ళీ కరోనా కేసులు. ఇప్పటికే అలియా భట్ కరోనా బారిన పడి కోలుకొంది. అలాగే, రీసెంట్ గా సినిమా ప్రొడక్షన్ టీంలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది.

షూటింగ్ ని నిలిపివేశారు. రామ్ చరణ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. షూటింగ్ చేసే పరిస్థితులు కూడా లేవు. మరి ఎప్పుడు పూర్తి చెయ్యాలి. అక్టోబర్ 13 డేట్ కి సినిమాని విడుదల చేయగలమా? ఇది రాజమౌళిని తొలిచేస్తోన్న ప్రశ్న.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రెండున్నరేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ అలా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాని పక్కా ప్లానింగ్ తో స్పీడ్ గా పూర్తి చెయ్యాలని భావించారు రాజమౌళి. కానీ కరోనా ఆయన ప్లాన్ ని తలకిందులు చేసింది.

More

Related Stories