రాజమండ్రి రోజ్ మిల్క్ – ఫస్ట్‌లుక్


జై జాస్తి, అనంతిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజమండ్రి రోజ్ మిల్క్’. వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత పట్నాయక్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సోషల్‌మీడియా వేదికగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. “ఈ సినిమా కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది,” అన్నారు దర్శకుడు నాని బండ్రెడ్డి. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అంటున్నారు నిర్మాత.

ఈ చిత్రానికి గోవింద్ వసంత్ (జాను ఫేమ్) సంగీతం అందిస్తుండడం విశేషం.

 

More

Related Stories