
సరిగ్గా నెల రోజుల క్రితం హీరో రాజశేఖర్ ఆరోగ్యం విషమించింది. ఒక దశలో ఆరోగ్యం బాగా క్షీణించడంతో అయన భార్య, కూతుళ్లు దేవుళ్లకు మొక్కుకున్నారు. ఎలాగైనా బతకాలని ప్రార్థనలు చేశారు. “దేవుడు గొప్పవాడు. మా ప్రార్థనలు, అభిమానుల ప్రార్థనలు ఆలకించాడు. మా నాన్న కోలుకునేలా చేశాడు. మా ఇంట్లోకి ఇప్పుడు నిజమైన దీపావళి వెలుగులు వచ్చాయి,” అని రాజశేఖర్ కూతురు పోస్ట్ చేసింది.
రాజశేఖర్ ఇప్పటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంట్లోనే ఆయనకీ వైద్యం అందుతోంది. కరోనాని నుంచి కోలుకున్నారు. కానీ ఇతర సమస్యల నుంచి ఇంకా ఆయన పూర్తిగా కోలుకోలేదు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మరో నెల రోజుల్లో పూర్తిగా ఆరోగ్యంగా తయారవుతారని, పోస్ట్ కరోనా స్ట్రెస్ కూడా పోతుందని డాక్టర్స్ చెప్పారట.
రాజశేఖర్ కుటుంబం నిన్న దీపావళి పండుగని చాలా ఆనందంగా జరుపుకొంది.