గండం నుంచి రాజశేఖర్‌ బయటపడ్డట్లే!

- Advertisement -
Rajasekhar

రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. మొన్నటివరకు ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో డాక్టర్స్ క్రిటికల్ కండిషన్ అని తేల్చారు. ఐతే… నిరంతరం బెస్ట్ ట్రీట్ మెంట్ అందించి, ప్లాస్మా థెరపీ కూడా చేసి… రాజశేఖర్ ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేశారు.

ఇప్పుడు ఆరోగ్యస్థితి బాగా మెరుగయింది. ఇక గండం నుంచి బయటపడ్డట్లే అన్న భావన రాజశేఖర్ కూతురు ట్వీట్లో కనిపించింది. “ఇప్పుడు హెవీ ఆక్సిజన్ ఫ్లో అందుతోంది ఆయనకి,” అని లేటెస్ట్ బులెటిన్ లో తెలిపారు సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ డాక్టర్స్.

ఈ నెల మొదటి వారంలో ఆయన ఈ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇద్దరు కూతుళ్లు, భార్య జీవితకి కూడా కరోనా అంటుకుంది. ఐతే కూతుళ్లు తొందర్లోనే కోలుకోగా, జీవిత గతవారం డిశ్చార్జ్ అయ్యారు. రాజశేఖర్ ఇంతకుముందే ఉన్న కొన్న అనారోగ్య సమస్యల పరిస్థితి విషమంగా మారింది. ఐతే ఇప్పుడు బాగా కోలుకుంటున్నట్లే.

 

More

Related Stories