‘రీమేక్ రాజా’శేఖర్!

Rajasekhar

రీసెంట్ గా ఓ కొత్త సినిమా ప్రకటించాడు హీరో రాజశేఖర్. నీలకంఠ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఓ రీమేక్ అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. హీరోగా స్వింగ్ గా ఉన్న టైములో రాజశేఖర్ చాలా రీమేక్ చిత్రాల్లో నటించి ‘రీమేక్ రాజా’శేఖర్ అనిపించుకున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్టయిన క్రైమ్ థ్రిల్లర్ “జోసెఫ్” అనే సినిమాకు రీమేక్ గా రాజశేఖర్-నీలకంఠ సినిమా రాబోతోంది. కాకపోతే, తెలుగులో కథ కొంత మార్చారు.

“కల్కి” తర్వాత వెంటనే ఓ రీమేక్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు రాజశేఖర్. కన్నడంలో సూపర్ హిట్టయిన “కవలదారి” అనే సినిమాను రీమేక్ చేస్తానని ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడదే సినిమాను సుమంత్ “కపటధారి” పేరిట రీమేక్ చేస్తున్నాడు.

అలా కెరీర్ లో మరోసారి గ్యాప్ ఎదుర్కొంటున్న రాజశేఖర్, ఈసారి కూడా రీమేక్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడట. స్వయంగా తనే “జోసెఫ్” సినిమాను నీలకంఠకు రిఫర్ చేశాడని తెలుస్తోంది. నీలకంఠకు సబ్జెక్ట్ నచ్చడంతో ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది.

Related Stories