రాజశేఖర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

Rajasekhar

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రాజశేఖర్ మళ్ళీ సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. మంచి క్యాచీ టైటిల్ పెట్టారు ఆయన నటించే కొత్త సినిమాకి. రాజశేఖర్ పుట్టిన రోజు (Feb 4) నాడు టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల ఉంటుంది. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు రాజశేఖర్.

కరోనాతో పోరాడి గెలిచాడు రాజశేఖర్. ఒక దశలో అతని పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఐతే, యాంగ్రీ మ్యాన్ గా పేరొందిన రాజశేఖర్ తన ఫైటింగ్ స్పిరిట్ ని కరోనా విషయంలో కూడా చూపాడు. కరోనాపై ఆయనదే పైచేయి అయింది.

రాజశేఖర్ గరుడ వేగ సినిమాతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ‘కల్కి’ అనే మూవీలో నటించాడు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఒక మలయాళ సినిమా కథని తీసుకొని తనదైన స్టయిల్ లో తీస్తున్నారు.

More

Related Stories