- Advertisement -

రెండు నెలల క్రితం హీరో రాజశేఖర్ నీలకంఠ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. సరిగ్గా షూటింగ్ మొదలుపెట్టే టైములో కరోనా సోకింది. ఒక దశలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించి ప్రాణాల మీదికొచ్చింది. ఐతే, ఇప్పుడు ఆయన బాగా కోలుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే షూటింగ్ లకు వెళ్ళకండి అని డాక్టర్లు చెప్పారు. దాంతో ఈ సినిమాని పక్కన పెడతారని అనుకున్నారు.
కానీ అలాంటి ఆలోచన లేదు అంటున్నాడు రాజశేఖర్. మలయాళంలో సూపర్ హిట్టయిన క్రైమ్ థ్రిల్లర్ “జోసెఫ్” సినిమాకు రీమేక్ గా రూపొందుతోంది ఈ మూవీ. “కల్కి” తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా ఫిక్స్ చేశాడు.
ఫిబ్రవరి నుంచి షూటింగ్ కి వెళ్తాను అని ధీమాగా చెప్తున్నాడు రాజశేఖర్. మొన్న హైదరాబాద్ ఎన్నికల్లో బయటికి వచ్చి ఓటు కూడా వేశాడు.