
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకోనున్నారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయారు. హ్యాపీగా ఉంటున్నారు. అన్యోన్య దంపతుల్లా కలిసిమెలిసిపోయారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల సునాయాసంగా అబద్దాలు ఆడేశారు. తామెప్పుడూ విడిపోవాలనుకోలేదని చెప్పారు. “కొంత కాలం విడిగా ఉన్నాం. వేరు వేరు ఇళ్లల్లో ఉన్నాం. దాంతో మేము విడాకులు తీసుకుంటున్నాం అనుకున్నారు. నేను మా నాన్నతో ఉన్నాను ఎందుకంటే… మా అమ్మ చనిపోయిన తర్వాత ఆయనకు తోడుగా ఉన్నాను. అది అపార్థాలకు దారితీసింది,” అని చెప్పారు రాజీవ్ కనకాల.
కానీ అది అబద్దమని సుమ ఇన్ స్టాగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకి కూడా తెలుసు. చాలాకాలం భర్తకు దూరంగా ఉన్నారు సుమ. విడిపోదామనుకున్న మాట వాస్తవమే. కానీ మళ్ళీ కలిసి జీవిస్తున్నారు. రాజీవ్ కనకాల తిరిగి తన జీవితంలోకి వచ్చిన తర్వాత సుమ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చదివితే చాలు రాజీవ్ కనకాల చెప్తున్న మాట ఎదో కవర్ డ్రైవ్ అని చెప్పడానికి.
భార్యాభర్తల్లో పొరపచ్చాలు కామన్… ఇప్పుడు అంతా సర్దుకుంది అని చెప్పేస్తే అయిపోయేది కదా. అన్నట్లు, రాజీవ్ కనకాల మళ్ళీ నటుడిగా బిజీ అయిపోయారు. ‘నారప్ప’లో కూడా మంచి పాత్రలో కనిపించారు.