- Advertisement -

సీనియర్ నటుడు ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఆయన ఒప్పుకున్న మరో కొత్త చిత్రం.. శాసనసభ. ఇది పాన్ ఇండియా చిత్రమంట.
ఈ సినిమాలో డా.రాజేంద్రప్రసాద్ ఎమ్మేల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఉన్నతంగా ఉంటుందట. ఆగస్టు 15 ఇండిపెండేన్స్ డే సందర్భంగా డా.రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా రూపొందుతున్న”శాసనసభ” తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కేజీఎఫ్ ఫేమ్ రవిబసుర్ సంగీతాన్ని అందిస్తున్నారు.