రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ఓటీటీ ఎంట్రీ

- Advertisement -
Senapathy

40 ఏళ్ల కెరీర్ ఉన్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా ఓటిటిలోకి అడుగుపెట్టారు. ఆయన నటించిన మొదటి ఓటిటి సిరీస్… సేనాపతి. ఆహాలో రానుంది. అదే.. సేనాప‌తి.

‘ప్రేమ ఇష్క్ కాద‌ల్’ వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని దీన్ని డైరెక్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్ర‌సాద్ నిర్మించారు. తాజాగా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఓ తాత‌య్య త‌న మ‌న‌వ‌డితో మాట్లాడుతున్న‌ట్లు మోష‌న్ పోస్ట‌ర్ ప్రారంభం అవుతుంది. చివర్లో రాజేంద్ర ప‌సాద్ ముఖంపై క‌న‌ప‌డుతుంది. ఇది క్రైం డ్రామా అని తెలియచేసేలా ఉంది మోషన్ పోస్టర్.

ఈ సిరీస్‌లో మూర్తి అనే సీరియ‌స్ పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్ క‌నిపించ‌నున్నారు.

 

More

Related Stories