ముసుగుతో వచ్చిన రాజేంద్రప్రసాద్

ఎఫ్3 సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఫన్ రైడ్ సెలబ్రేషన్స్ పేరిట హైదరాబాద్ దసపల్లాలో పెద్ద ఈవెంట్ చేశారు. దీని కోసం మరోసారి యూనిట్ అంతా ఒక్కటయ్యారు. అమెరికాలో ఉండడం వల్ల దిల్ రాజు రాలేకపోయారు. ఈ కార్యక్రమానికి ముఖానికి మాస్క్ తో రాజేంద్ర ప్రసాద్ రావడం అందర్నీ ఆకర్షించింది. అదే టైమ్ లో ఆశ్చర్య పరిచింది కూడా.

స్టేజ్ మీద కొచ్చి మైక్ అందుకునేంత వరకు రాజేంద్ర ప్రసాద్ తన ముఖంపై కప్పుకున్న కర్చీఫ్ తీయలేదు. మైక్ అందుకున్న తర్వాత మాత్రమే ఆయన కర్చీఫ్ తీశారు. ఇదేదో కరోనా నివారణ చర్య కాదు. గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్ కు కట్టుబడి రాజేంద్ర ప్రసాద్ ఈ పని చేశారు.

ఎఫ్3 రిలీజ్ కు ముందు రాజేంద్రప్రసాద్ భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ సినిమా హిట్టవ్వకపోతే, మళ్లీ జనం ముందుకు రానన్నారు. ఆయన అంత భారీ స్టేట్ మెంట్ ఇవ్వడంతో యూనిట్ కూడా అవాక్కయింది. అందుకే ఈ రోజు స్టేజ్ పై ముసుగుతో వచ్చారు రాజేంద్ర ప్రసాద్. అందరితో సినిమా బ్లాక్ బస్టర్ అయిందని అనిపించిన తర్వాతే మాస్క్ కిందకు దించారు.

ఎవరికి ఎలాంటి అనుమానాలున్నాయో తనకు తెలియదు కానీ, తనకు మాత్రం ఎఫ్3 రిజల్ట్ పై ఎలాంటి అనుమానం లేదన్నారు రాజేంద్ర ప్రసాద్. అందుకే గతంలో అంత బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చానని, ఇప్పుడు అంతే ధైర్యంగా స్టేజ్ పై మాట్లాడుతున్నానంటూ ప్రకటించుకున్నారు.

 

More

Related Stories